చెన్నై శ్రీ కపాలీశ్వర్ ఆలయం: "మైలాపురమే కైలాసం-కైలాసమే మైలాపురం” అని ఎందుకు అంటారు?

తమిళనాడులోని శైవ క్షేత్రాల్లో చెన్నై నగరంలోని మైలాపూర్ కపాలీశ్వర్ ఆలయం చాలా ప్రసిద్ధి. మైలాపూర్ కి "తిరుమయిలై" అని కూడా పేరు. 7వ శతాబ్దంలో పల్లవులచే నిర్మించిన ఈ ఆలయం, పోర్చుగ్రీస్ వారి దండయాత్రల్లో ధ్వంసమవడంతో 14వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తులచే పునర్నిర్మించబడింది.
Kapaleeswarar Temple Mylapore

తూర్పు దిక్కులో ఉన్న 120 అడుగుల గోపురం 1906లో నిర్మించారు. 7 అంతస్తులుగా ఉన్న ఈ గోపురంలో శిల్ప కళా నైపుణ్యం ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. పశ్చిమ దిక్కులో ఉన్న చిన్న గోపురం పుష్కరిణి వైపు ఉంటుంది. 

చూడ ముచ్చటైన దీపారాధన కుందులు: Bhimonee Decor Shanku Chakra Diyas - 3 inches, Brass
Advertisement*

ఇక్కడ ఉన్న పుష్కరిణి చాలా పెద్దది, ఇది చెన్నై మహా నగరానికి ఒక ముఖ్యమైన లాండ్ మార్క్. ఏటా జరిగే రధోత్సవం నాడు ఈ పుష్కరిణి వీధులు ఎంతో కళకళలాడుతూ ఉంటాయి. ఈ పుష్కరిణి గట్టు పితృ తర్పణాలకు, ఇతర కార్యక్రమాలకు ఒక వేదిక.
Kapaleeswarar Temple Mylapore

ఈ ఆలయంలో ప్రధాన దైవం పేరు- కపాలీశ్వరుడు, అమ్మవారి పేరు కర్పగంబాళ్. మార్చ్-ఏప్రిల్ నెలల మధ్యలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవం ఇక్కడుండే వారికి ఒక అతి పెద్ద పండగ. 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవంలో, 7వ రోజున జరిగే ‘అరుబత్తిమూవర్’ ఉత్సవం పరమ శివ భక్తులైన 63 నయనార్ల అంకిత భావానికి గుర్తుగా చాలా విశేషంగా జరుగుతుంది.
Kapaleeswarar Temple Mylapore

| అదనపు సమాచారం: మైలాపూర్ శ్రీ కపాలీశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు

ఈ ఆలయ చరిత్రకు సంబంధించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

ఒకప్పుడు బ్రహ్మ దేవుడు తనకు ఐదు తలలు ఉన్నందుకు తాను చాలా గొప్పవాడిగా భావించాడు, అలాగే ఆ పరమ శివుడికి ఎందులోనూ తక్కువ కాదని కూడా గర్వంతో ఎగసిపడ్డాడు. అందుకు ఆ మహా శివుడు బ్రహ్మకు తగిన గుణపాఠం చెప్పాలని, ఒక తలని తుంచేసి ఆయన పుర్రెను చేతిలో పట్టుకుంటాడు. 

బ్రహ్మ తన తప్పును తెలుసుకుని, భూలోకంలో ఒక శివలింగాన్ని ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాడు. అందుకే ఇక్కడ వెలసిన ఆ పరమ శివుడికి ‘కపాలీశ్వర్’ అని, అలాగే ఆ ప్రాంతానికి ‘కపాలీశ్వరం’ అని పేరు వచ్చింది.
Kapaleeswarar Temple Mylapore

ఇక రెండవ కథ ఏమిటంటే- ఒకసారి కైలాసంలో పార్వతీదేవి విభూతి యొక్క వైభవాన్ని, పంచాక్షరీ నామం అయిన నమశివాయ యొక్క ప్రాశస్త్యం తెలుసుకోవాలని శివుడిని అడిగింది. అప్పుడు శివుడు ఎంతో శ్రద్ధగా వివరణ ఇస్తున్న సమయంలో, పార్వతి దేవి యొక్క దృష్టి ఎందుకో అక్కడున్న ఒక నెమలి పై మరలి పరధ్యానంలో పడింది.

అందుకు ఎంతో కోపోద్రిక్తుడైన శివుడు, పార్వతి దేవిని నెమలిగా మారి భూలోకానికి వెళ్ళి తపస్సు చేసుకోమని శపిస్తాడు. అప్పుడు నెమలిగా మారిన పార్వతిదేవి, తొండైనాడులో ఒక పున్నాగ చెట్టుకింద ఉన్న శివలింగాన్ని ఎంతో శ్రద్ధగా ఆరాధిస్తుంది. ఆవిడ భక్తికి మెచ్చిన శివుడు, ఆమెకు శాపవిమోచనం ఇచ్చి “కర్పగవల్లి” అని ప్రేమగా పిలుస్తాడు.

ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms
Advertisement*

తమిళంలో ‘మయల్’ అంటే ‘నెమలి’, నెమలి రూపంలో పార్వతి దేవి ఘోర తపస్సు చేసిన ఆ ప్రాంతానికి ‘మైలాపురం’ అని కూడా పేరు. అందుకే “మైలైయే కైలై - కైలైయే మైలై” అని హితోక్తి, అంటే “మైలాపురమే కైలాసం - కైలాసమే మైలాపురం” అని అర్థం.
Kapaleeswarar Temple Mylapore

నాలుగు వేదాలు ఇక్కడున్న స్వామిని పూజించడం వల్ల ఈ ప్రాంతానికి ‘వేదపురి’ అని, అలాగే శుక్రగ్రహం శివుడిని ఆరాధించడం వల్ల ‘శుక్రపురి’ అని కూడా పేరు. రాముడు ఇక్కడ పూజలు చేసి రావణుడిపై యుద్ధంలో గెలిచి లంక నుండి సీతను తిరిగి తీసుకువచ్చాడు. శుక్రాచార్యుడు ఇక్కడ స్వామిని అర్చించి కోల్పోయిన కన్నును తిరిగి పొందాడు.
Kapaleeswarar Temple Mylapore

సూరసంహారానికి ముందు సుబ్రమణ్యస్వామి వారు ఇక్కడికి వచ్చి తల్లితండ్రులను పూజించి వారినుంచి ‘శక్తివేల్’ అనే ఆయుధాన్ని పొందినట్లు చెపుతారు. అలాగే సూరసంహారం అనంతరం విజయోత్సవంతో వచ్చిన సుబ్రమణ్యస్వామి వారికి గుర్తుగా నిర్మించిన ‘సింగార వేలర్’ ఆలయం ఇక్కడ ఉంది.
Kapaleeswarar Temple Mylapore

ఈ ఆలయ ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలు, మండపాలు ఉన్నాయి.

వాటిలో ముఖ్యమైనవి- నర్తన వినాయకర్ మందిరం, పళని ఆండవర్ గా పిలవబడే సుబ్రమణ్యస్వామి ఆలయం, పొన్న చెట్టు సమీపంలో ఉన్న పున్నై వననాధర్ మండపం, శివ స్వరూపాలైన సుందరేశ్వరర్ మరియు జగదీశ్వరర్ ఆలయాలు. ఇక్కడ నవగ్రహ మంటపంతో పాటు ఈశాన్యంలో శనీశ్వరస్వామికి ప్రత్యేకంగా ఒక చిన్న ఆలయం కూడా వుంది.

నవగ్రహ పూజకు నవ ధాన్యాలు: Sri Yagnaa - Navadhanyalu for Navagraha Pooja (100 gms each)
Advertisement*

అలాగే ఈ ఆలయం గోడలపై శివుని యొక్క స్తోత్రాలు, సుబ్రమణ్యస్వామికి చెందిన కవాచాలు, అమ్మవారికి సంబందించిన స్తోత్రాలు ఎంతో చాలా చక్కగా చెక్కారు.
Kapaleeswarar Temple Mylapore

63 నాయనర్లలో ఒకడైన వాయిలర్ నాయనార్, తిరుక్కురళ్ రచించిన తిరువళ్ళువర్ కూడా మైలాపురానికి చెందినవారే. అలాగే పరమ శివ భక్తుడైన తిరుజ్ఞాణ సంబందార్ ఇక్కడ వెలసిన కపాలీశ్వర్, కర్పగాంబాళ్ మరియు సింగార వేలర్-లను తాను రచించిన దేవర పత్తికాల్లో ఎంతో గొప్పగా స్తుతించాడు.

| అదనపు సమాచారం: చెన్నైలో తప్పకుండా చూడాల్సిన ట్రిప్లికేన్ శ్రీ పార్థ సారధి ఆలయం !! (108 దివ్యదేశం)

Kapaleeswarar Temple Mylapore

ఈ ఆలయ ప్రాంగణంలో స్థల వృక్షమైన పున్నాగ చెట్టును చూడవచ్చు. దానికి అనుకుని వున్న గోశాలలో ఎన్నో గోమాతలను కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో దక్షిణం వైపు జమ్మి చెట్టు, అలాగే శివలింగ పుష్పాలు పూసే నాగమల్లి చెట్లు కూడా ఉన్నాయి.
Kapaleeswarar Temple Mylapore

ఓం నమః శివాయ !! మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!

Comments